రూమ్ బుక్ చేస్తా వస్తావా అన్నారు, అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్
సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీశరత్‌కుమార్. తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి,ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది.
చెల్లిగా, అక్కగ నటిస్తూ,విలన్ గా అవతారం ఎత్తింది. పవర్ ఫుల్ లేడీ విలన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.తెలుగులో క్రాక్, వీరసింహ రెడ్డి, నాంది లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది.
ఈ నటి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. మార్చి1వ తేదిన ఆమె నిశ్చితార్థ వేడుక నికోలయ్ సచ్‌దేవ్‌తో ముంబైలో రహస్యంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మధ్య అంగరంగ వైభవం గా జరిగింది.
తాజాగా టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో కనిపించి మెరిసింది నటి వరలక్ష్మి. ఈ సినిమా బాక్సాఫీస్ ఎంతటి వసూళ్లను రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
టాలీవుడ్‌లో, కోలివుడ్‌లో కూడా ఆమె బిజి బిజిగా ఉన్నారు. రాయన్‌లోనూ వరలక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మళయాళంలో కలర్స్ చిత్రం, తెలుగులో శబరి చిత్రాల్లో నటిస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది.
అమ్మాయిలు ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే అంత సులువు కాదు. ఈ విపయంలో వాళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది అన్నారు. అందుకే మా నాన్న గారికి నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు అన్నారు వరలక్ష్మీ.
రీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు తప్పలేదు.నటిగా బిజీ అవుతున్న రోజుల్లో ఓ సంఘటన జరిగింది. ఓ టీవీ ఛానల్ అధినేత మా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్ కోసం నన్ను తీసుకోబోతున్నట్టు అడిగాడు. దానికి నేను ఓకే అన్నాను.
కానీ ఆ తర్వాత అతని బుద్ది తెలిసింది. మరో రోజు ఫోన్ చేసి,మనం మళ్ళీ కలుద్దాం.ఇంట్లో వద్దు బయట కలుద్దామా,రూమ్ బుక్ చేస్తాను,మాట్లాడుకుందాం అని అన్నాడు. అతని దురుద్దేశం గ్రహించి అతడిపై కేసు పెట్టాను అని చెప్పింది.
స్టార్ హీరో కూతురు అయినంత మాత్రాన నాకు అవకాశాలు వస్తున్నాయి అనేది నిజం కాదు.నన్ను కూడా చాలా మంది కమిట్మెంట్ అడిగారు. దాని వల్ల చాలా ఆఫర్స్ పోగొట్టుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
No comments