స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
రతిక రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.ఈ భామ గతంలో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో పాల్గోని మంచి గుర్తింపు పొందింది.
బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ 7 లో తన టాస్క్‌లతో పాటు అంద చందాలతో అదరగొట్టింది రతిక. ఈ భామ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు రాలేదు.
అయితే హౌస్‌లో ఉన్న సమయంలో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ వంటి తోటి కంటెస్టెంట్లతో లవ్ ట్రాక్ నడిపింది రతిక అనే రూమర్స్ వినిపించాయి. ఇక మరోవైపు రతిక కొన్నేళ్ల క్రితం బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె ప్రేమాయణం నడిపించింది.
ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో వాళ్ల బంధానికి బ్రేకప్ పడింది. రీసెంట్‌గా వీళ్లిద్దరు దగ్గరగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రతికాకు సినిమా అవకాశాలు క్యూకట్టాయి . ఈ చిన్నది దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఇంత వరకు ఆ సినిమా గురించి ఎలాంటి ఊసు లేదు.
రతికా రోజ్ కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు రతికా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్ .
అంతే కాదు మరో హీరో విజయ్ సేతుపతితో కూడా నటిస్తున్నా అని తెలిపింది రతికా రోజ్. దాంతో రతికా రోజ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
No comments