• Breaking News

    ఏజెంట్ బామా సాక్షి వైద్య........

     ఇటీవల మలయాళ హిట్‌ సినిమాలతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న వారు చాలా మంది ఉన్నారు. 


    అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ తో ఏజెంట్‌ సినిమాలో మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గాండీవ దారి అర్జున సినిమాలో నటించింది.

    ముద్దుగుమ్మ సాక్షి వైద్య కి ఒక్క విజయం కూడా టాలీవుడ్‌ లో దక్కలేదు. ఇద్దరు ప్రముఖ యంగ్‌ హీరోలకు జోడీగా నటించినా కూడా ఫలితం దక్కలేదు.

    రెండు బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్‌ పడటంతో సాక్షి వైద్య ను టాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు. 

    సాక్షి వైద్య అందంతో పాటు అభినయం విషయంలో మంచి మార్కులు దక్కించుకున్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌ లో ఆఫర్లు రాలేదు. 

    అయితే మలయాళ సినీ ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.


    మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న 'హాల్‌' అనే సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.


     ప్రశాంత్ విజయ్ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా షేన్‌ నిగమ్‌ నటిస్తున్నాడు. 


    ఇష్క్‌, కుంబళంగి నైట్స్‌ ఇంకా ఆర్‌డీఎక్స్‌ సినిమాల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపును షేన్‌ దక్కించుకున్నాడు.


    ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో మలయాళ సినిమాలు సూపర్‌ హిట్‌ అవుతున్నాయి. 




    No comments