తన విడాకుల రూమర్స్ పై స్పందించిన హీరోయిన్ నమిత ...
ఈమె తెలుగు భారతీయ నటి. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. ఈమె గుజరాత్ రాష్ట్రం సూరత్లో జన్మించింది. 1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది.
జెమిని చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది. ఈమె స్పెషల్ అప్పియరెన్స్ గా మరికొన్ని చిత్రాలలొ నటించింది.
కెరీర్ స్లో అయిన టైంలోనే 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు జన్మించారు.
కొన్ని రోజులుగా నమిత వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. నమిత తన భర్తతో విడిపోతుందని,త్వరలోనే విడాకులు తీసుకుంటుందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే డివోర్స్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.
ఆ రూమర్స్ చూసి నా స్నేహితులు, బంధువులు కాల్ చేసి మమ్మల్ని అడిగారు. అయినా ఇలాంటి నిరాధరమైన వార్తలు ఎందుకు వస్తున్నాయనేది తెలియడం లేదు. కొన్నిసార్లు మా డివోర్స్ గురించి వార్తలు రావడం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం.
అలాగే అలాంటి రూమర్స్ చూసి మేము బాధపడడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమిత చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
తమిళనాట నమితతో జోడీ కట్టని హీరో లేడు. కుర్ర హీరోలతో మొదలుపెట్టి సీనియర్స్ వరకు అందరితోనూ రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ళ కెరీర్లో తమిళనాటే ఎక్కువ సినిమాలు చేసింది నమిత. అటు కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటింది.
No comments