• Breaking News

    పెళ్లి కాకుండా తల్లైన యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి

     గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ఈ సినిమాతో ఒక్కసారిగా ఓవర్నైట్ స్టార్ ఐపోయింది.


    యానిమల్ సినిమాలో రణ్‌బీర్‌, త్రిప్తి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.ఈ అమ్మడు అందాలకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు..ఈ సినిమాలో అమ్మడు చాలా బోల్డ్ గా కనిపించింది.


    ఇక ఈ సినిమాతో  నేషనల్ క్రష్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిప్తి. అంతేకాదు,ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ సైతం పెరిగారు. ఇప్పుడు త్రిప్తి ఎక్కడ కనిపించిన క్షణాల్లో గుర్తుపట్టేస్తున్నారు.


    ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటూ  బిజీగా ఉంటుంది త్రిప్తి. ఇప్పటికే భూల్ భూలయ్యా 3, ఆషికీ 3లో ఛాన్స్ కొట్టేసింది.తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.


     ఇప్పుడామె ఓ కొత్త సినిమా చేస్తోంది. ఈ సినిమా బ్యాడ్‌ న్యూజ్‌ అనే పేరుతో ఇది రూపొందుతోంది.ఇందులో విక్కీ కౌశల్‌, అమీ విర్క్‌ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఆనంద్‌ తివారీ దీనిని తెరకెక్కిస్తున్నారు.


    ఈ చిత్రంలోనే ఆమె ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తుంది.తాజాగా ఈమె టవలు చాటున వున్నా తన అందాలతో కవ్విస్తోంది.కుర్ర కారుల డ్రీం గర్ల్ లా మారిపోయింది.


    ట్రిప్తి డిమ్రీ 23 ఫిబ్రవరి 1994లో పుట్టింది.ఈమె హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ లో తొలిసారిగా నటించింది మరియు రొమాంటిక్ డ్రామా లైలా మజ్నులో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది.


     తాజాగా సోషల్ మీడియాలో త్రిప్తికి సంబంధించిన ఓ వీడియో వైరలవుతుంది. అందులో ఆమెతోపాటు మరో మిస్టరీ మ్యాన్ కూడా కనిపిస్తున్నాడు. అయితే అతడు త్రిప్తి ప్రియుడు సామ్ మర్చంట్ తుస్రా అని తెలుస్తోంది.

    No comments