ఐపియల్ పై సంచలన కామెంట్స్ చేసిన చాందిని చౌదరి...
షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు టాలీవుడ్ హీరోయిన్ గా ఎదిగింది చాందిని చౌదరి. అందం, అభినయం , నటనతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది ఈ వైజాగ్ బ్యూటీ.
కలర్ ఫోటో సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమె అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో కథానాయికలను ఇతర స్టేట్స్ నుండి తెచ్చుకుంటున్న మన దర్శక నిర్మాతలు , తెలుగమ్మాయలకి కూడా మంచి అవకాశాలు ఇస్తున్నారు.అలాంటి అవకాశాలను అందిపుచ్చుకున్నవారిలో చాందిని చౌదరి ఒకరు.
చాందిని ఒక బలమైన పాత్రలో కనిపించబోతోంది.ఈసారి ఒక బలమైన పోలీస్‌ఆఫీసర్‌గా యేవమ్ చేస్తుంది. ఆ సినిమా నుండి ఆమె లుక్ ని విడుదల చేశారు.
ఇటీవలే గాని మూవీ లో విశ్వక్ సేన్ సరసన నటించింది. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో చాందిని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
అమ్మాయిలు ఇప్పటికీ కూడా ఏదైనా తప్పు చేస్తే,లేదా అమ్మాయిల నుంచి తాము వినకూడని విషయాలు వింటున్న వెంటనే మగవాళ్ళందరూ అమ్మాయిలని లం* లేదా అలాంటి అర్థం వచ్చే పదాలతో అసభ్యంగా మాట్లాడుతున్నారు అంటూ అబ్బాయిలపై తన అభిప్రాయాన్ని చెప్పింది.
2024 లో కూడా ఇలాంటి మాటలతో ఆడవాళ్ళని హింసిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది, అలాగే భయం వేస్తోంది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది మొహం లేని, పేరు లేని వ్యక్తులు వాళ్లకు నచ్చని వాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ఆరోపించింది.
No comments