తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పిన శ్రీలీల....
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌లో రాణిస్తోన్న అందాల హీరోయిన్అం శ్రీలీల.అందం,అభినయం వున్నా భామల్లో శ్రీలీల ఒకరు.ఈమె 2001 జూన్ 14 న పుట్టింది.
పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే యూత్‌లో భారీగా క్రేజ్ తెచ్చుకుంది.ఆ తరువాత రవితేజతో నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ధమాకా సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది.ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో శ్రీలీల కు వరుస ఆఫర్స్ వచ్చాయి.
కానీ శ్రీలీల కు కాలం కలిసి రాలేదు .ఆమె చేసిన వరుస సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి.గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే,భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి.
గుంటూరు కారం రిజల్ట్ చూసిన శ్రీలీల,కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనీ నిర్ణయం తీసుకుందట. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోన్న శ్రీలీలకు బెట్టింగ్ యాప్ లకు, మద్యం బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఆఫర్ వచ్చిందట.కానీ శ్రీలీల ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం.
శ్రీలీల తమిళ్ స్టార్ హీరో తో కలిసి ఐటెం సాంగ్ చేస్తుంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి నిజం గా శ్రీలీల ఈ ఐటెం సాంగ్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.
కొన్నాళ్లపాటు చదువుపై ఫోకస్ చేయాలనీ ఈ భామ భావిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. అందులో భాగంగానే కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవట్లేదట. అంతేకాదు సరైనా కథ, క్యారెక్టర్ ఉంటూనే నటించాలనీ, అందులో భాగంగా సినిమాల నుంచి కొంత విరామం తీసుకోవాలనీ శ్రీలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
No comments