• Breaking News

    సమంతాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తెలుగు భామ శోభిత ధూళిపాళ్ల

    శోభిత ధూళిపాళ్ల  హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.


    శోభితా ధూళిపాళ్ల.ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈమె పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ముందుగా హిందీ చిత్రసీమ ద్వారానే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.


    2018లో అడవి శేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది.ఇక పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో కూడా మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది శోభిత.





    కొద్దిరోజులుగా శోభిత తరచూ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో ఎఫైర్ ఉందంటూ ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అటు బాలీవుడ్లోనూ వీరిద్దరి గురించి గుసగుసలు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. 



    తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.


    ఈ ఘటన తరువాత , చైతన్య, శోభితలకు సమంత కౌంటర్ ఇవ్వడం,దానికి శోభిత తిరిగి కౌంటర్ ఇవ్వడం వంటివి చకా చకా  జరిగిపోయాయి. చైతూ,శోభిత రిలేషన్ గురించి వార్తలు వచ్చిన వెంటనే.సమంత తన వెడ్డింగ్ డ్రెస్ రీ క్రియేట్ చేయించి వారికి కౌంటరిచ్చిందనే ప్రచారం జరుగుతోంది.



    దీనికిగాను  శోభిత సమంతకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది..నేను ప్రతి ఒక్కరి కప్ ఆఫ్ చాయి కాదు అంటూ సామ్‌కు శోభితా అదిరిపోయే విధంగా కౌంటర్ ఇచ్చింది.


    కేవలం హిందీ, తెలుగు చిత్రాల్లోనే కాకుండా శోభితా,మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది. ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.




    ఇక ఇన్ స్టాలో డైలీ అప్డేట్స్ ఇస్తూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. క్రేజీ ఔట్ ఫిట్స్ లో నెటిజన్లకు కిక్కిచ్చే పోజులు ఇస్తుంటోంది. రకరకాల స్టిల్స్ తో కుర్రకారును మైమరపిస్తుంటోంది. 


    No comments