• Breaking News

    49 ఏళ్ల వయస్సు లో హాట్ లుక్‌లతో రెచ్చి పోతున్న కాజోల్......

     ఒక భారతీయ సినీ నటి కాజోల్ ,ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలలో నటించింది. షారుక్ ఖాన్, కాజోల్ జోడీ బాలీవుడ్లో హిట్ పెయిర్ గా ఉన్నారు.

    కాజోల్తల్లి తనూజ. కాజోల్ తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో... చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో ముంబైలోని పాంచ్‌గనిలో సెంట్ జోసెఫ్ కాన్వెంట్ బోర్డింగ్ స్కూల్‌లో చదువు సాగించింది.

    క్లాస్‌లో హెడ్‌గాళ్. చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి. డ్యాన్స్ నేర్చుకొంది. ఫిక్షన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొంది. అవే జీవితంలో ఎదిగేందుకు దోహదపడ్డాయని చెప్పారు. ఫిక్షన్ నవలలు చదవడం వల్ల కష్టాల్ని సులువుగా అధిగమించానని చెబుతుంటుంది.

    కాజోల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారి కుటుంబమంతా సినిమా పరిశ్రమ చందిన వరే నూతన్, శోభన్ సమర్థ్, రతన్ బాయి, జాయ్‌ముఖర్జీ, దేవ్‌ముఖర్జీ, శశిధర్ ముఖర్జీ... ఇలా కాజోల్ బంధువులంతా సినిమా పరిశ్రమలోనే జీవిస్తున్నారు. 

    కాజోల్ కజిన్స్ కూడా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. రాణీముఖర్జీ, షర్వాణీ ముఖర్జీ, మోనిష్ భెల్, దర్శకుడు అయాన్‌ముఖర్జీ... ఇలా అందరూ కూడా పరిశ్రమలో రాణిస్తున్నారు. కాజోల్‌కి స్వయానా ఓ చెల్లి ఉంది. ఆమె పేరు తనీషా. తెలుగులోనూ నటించింది.


    తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే తొలి అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో 'బెఖుడి'లో నటించే అవకాశాన్నిపొందింది.


     వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా సినిమా పూర్తి చేసేది. అయితే ఆ సినిమా విఫలం చవిచూసింది. అయినా... కాజోల్ నటన, అందం చూసి అప్పటికే 'బాజీగర్' సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు.


    1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాజీగర్' వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో బాలీవుడ్ దృష్టిలో పడిందిvకాజోల్. చదువులు పూర్తి కాకమునుపే స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై వైపు వచ్చేసింది.


    1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన 'సీతారామయ్యగారి మనవరాలు'కి రీమేక్‌గా తీశారు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ సరసన నటించింది. 1995లో ' కరణ్ అర్జున్ ', 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే' చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు.



    ప్రేమకథలకీ, కుటుంబ కథా చిత్రాలకే పరిమితమైపోతోంది. ఇతరత్రా కథలకు ఆమె న్యాయం చేయలేదేమో అనుకొంటున్న దశలోనే... కాజోల్ ముఖ్యమైన నిర్ణయం తీసుకొంది.


     నటనకు ప్రాధాన్యమున్న పాత్రలవైపు అడుగులేసింది.

    No comments