• Breaking News

    మూవీస్ కి బాయ్ బాయ్.........?? కంగనా రనౌత్

     ప్రముఖ భారతీయ నటి కంగనా రనౌత్ ,బాలీవుడ్ లో కంగనా రనౌత్ అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో  ఒకరు. 

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ పేరు పొందారు కంగనా రనౌత్ . కంగనా రనౌత్  ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు తీసుకున్నారు.

    హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ .ఎన్నికల అనంతరం తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టబోనని ఆమె స్పష్టత ఇచ్చారు. 

    తన సినిమాలు చాలా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం సినీ పరిశ్రమను విడిచిపెట్టలేనని తెలిపారు , ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ తెలిపారు చేశారు. అయితే కంగనా రనౌత్ చేసిన తాజా మాటలు మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. 

    ఇండస్ట్రీలో కొనసాగాలనే ఆమె నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది.కాగా కంగనా రనౌత్ చివరిగా ‘తేజస్‌’ సినిమాలో కనిపించింది. మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం కంగనా రనౌత్ చేస్తుంది.

    కాగా మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఆ స్థానంలో వ్యూహాత్మకంగా కంగనా రనౌత్‌ని బీజేపీ రంగంలోకి పంపింది. తాజా మాటలు తో కంగనకు గట్టి సవాలు ఎదురవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


    లోక్‌సభ ఎన్నికలు 7వ దశలో ఇక్కడ పోలింగ్ నడుస్తుంది. జూన్ 1న 4 లోక్‌సభ స్థానాలతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో ఆ స్థానాలకు కూడా పోలింగ్ నడుస్తుంది.

    భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది, 2019లో మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న తర్వాత మరోసారి విజయంపై దృష్టి పెట్టింది. జూన్ 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల ఫలితాలపై  తెరపడనుంది.


     దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతున్న మండి నియోజకవర్గం ప్రత్యేకించి ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రస్తుతం దివంగత నేత భార్య ప్రతిభా దేవి సింగ్ ఆధీనంలో ఉన్న ఈ సీటుకు 2021లో బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ మృతి చెందడంతో ఉప ఎన్నిక కొంసాగుతున్నాయి.

    పదహారేళ్ల వయసులో, థియేటర్ డైరెక్టర్ అరవింద్ గౌర్ వద్ద శిక్షణ పొందే ముందు రనౌత్ 
    పూర్తిగా మోడలింగ్ చేపట్టారు .కంగనా రనౌత్  2006 థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్‌లో తన చలనచిత్ర రంగలో మొదలుపెట్టింది,

     దాని కోసం కంగనా రనౌత్  ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది మరియు వో లమ్హే... 2006.


    No comments