• Breaking News

    స్టార్ హీరోయిన్ అవ్వాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని అంటున్న రమ్య కృష్ణ

     రమ్యకృష్ణ ఒక భారతీయ సినీ నటి. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె చిన్న వయసు లోనే  సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. రమ్య ప్రముఖ నటులందరి సరసన నటించింది.


    రమ్య కృష్ణ 1985లో  ఇద్దరు మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలోకి  ప్రవేశించి, 1989లో సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.



    1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. 


    తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా గుంటూరు కారంలో మహేష్ బాబు కు అమ్మ గా రమ్యకృష్ణ నటించింది.



    రమ్యకృష్ణ నాలుగు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు మరియు మూడు సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.


    కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా రమ్యకృష్ణ నిలిచారు.ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేశారు. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేశారు తెలుగు ప్రేక్షకుల్ని.


    స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.సినిమా ఇండస్ట్రీ లో ఉండాలంటే హీరోయిన్లు కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని రమ్యకృష్ణ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .

    No comments