• Breaking News

    ఇండియా లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఐటెం భామ ఎవరో తెలుసా......

      సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించి తన అభిమానులుతో  సహా తెలుగు ప్రేక్షకులు అందరినీ షాక్ కి గురి చేసింది.


    ఒక ఐటమ్ గర్ల్‌ కేవలం సింగిల్ సాంగ్‌కు రూ.5 కోట్లు తీసుకుని ఆశ్చర్యపరిచింది. ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ ఐటమ్ గర్ల్‌గా నిలిచిన ఆ నటి, మన తెలుగు వారికి బాగా తెలిసిన సెలబ్రిటీ.


    ఈరోజుల్లో దాదాపు అన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ అనేది ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. గతంలో సిల్క్ స్మిత లాంటి వారు ఈ పాటల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.


    ఇంతకు ముందు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడేవారు. అయితే ఇప్పుడు మాత్రం మన స్టార్ హీరోఇన్లే ఐటెం సాంగ్స్ చేస్తూ దూసుకుపోతున్నారు.


    ఇందుకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక ఐటమ్ గర్ల్‌ కేవలం సింగిల్ సాంగ్‌కు రూ.5 కోట్లు తీసుకుని ఆశ్చర్యపరిచింది. ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ ఐటమ్ గర్ల్‌గా నిలిచిన ఆ నటి ఎవరో కాదు మన సమంత రూత్ ప్రభు.


    టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంతకు ఒక రేంజ్‌లో క్రేజ్ ఉంది. నటన, అందంతో ఆడియన్స్‌ను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా, ఇప్పుడు హాట్ సాంగ్స్‌లో అదిరిపోయే స్టెప్పులేస్తూ సెగలు పుట్టిస్తోంది. 


    సినీ ఇండస్ట్రీలోని కొందరు ఐటమ్ గర్ల్స్ స్పెషల్ సాంగ్స్‌ కోసం రూ.1 కోటికి పైగా ఛార్జ్ చేస్తున్నారు. కానీ సమంత మాత్రం పుష్ప ది రైజ్ సినిమాలో ఊ అంటావా పాటలోనటించింది. 


    ఈ పాటలో ఐదు నిమిషాల పాటు కనిపించినందుకు అక్షరాలా రూ. 5 కోట్ల పారితోషికం అందుకుంది. భారతీయ సినిమా చరిత్రలో ఏ నటి కూడా ఒక్క పాటకు ఇంత డబ్బు తీసుకోలేదు.


    ఐటమ్ సాంగ్స్‌కు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఇతర నటీమణుల్లో నోరా ఫతేహి, సన్నీ లియోన్ ఉన్నారు. వీరిద్దరూ ఒక్క పాటకు రూ.2 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మలైకా అరోరా నేడు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.


    స్టార్ హీరోయిన్ సమంతకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తాను ఒక్క ఫొటో పెట్టినా నిమిషాల్లోనే అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. 


    రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా సమంత కూడా ప్రసిద్ధి గాంచింది. ఏ మాయ చేశావే సినిమాకిగాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు  ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డ్ వరించాయి.

    No comments