తాను లేకుండా నాజీవితం ఊహించుకోలేను..... నటి సిమ్రాన్
నటి సిమ్రాన్ మేనేజర్ ఎం.కామరాజన్ అనారోగ్యంతో మరణించారు . దాదాపు 25 ఏళ్లుగా నటి దగ్గర పనిచేసిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.
ఈ విచారకరమైన వార్తను సిమ్రాన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది.
బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున ఇలా దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.
అడపాదడపా సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది.
సోషల్ మీడియా ద్వారా తెలుగు అభిమానులకూ టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
సిమ్రాన్ మేనేజర్ ఎం.కామరాజన్ అనారోగ్యంతో మరణించారు . దాదాపు 25 ఏళ్లుగా నటి దగ్గర పనిచేసిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు.
సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన నటి. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్లి ద్వారా పరిచయం చేసాడు.
సిమ్రాన్ పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది.
సిమ్రాన్ ప్రస్తుతం మనాలీ వెకేషన్‌లో ఉంది. మనాలిలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
No comments