• Breaking News

    రాధికా ఆప్టే జీవిత చరిత్ర.....

     రాధిక ఆప్టే ఒక భారతీయ నటి. స్వతహాగా మరాఠీ నటి అయినప్పటికీ కొన్ని తెలుగు, హిందీ సినిమా లలో చేసింది.


    వీరిది సినిమాలతో కుటుంబానికి సంబంథంలేదు. రాధికా ఆప్టే  నాన్న గారు చారుదత్ ఆప్టే ఒక్క పుణేలోనే కాదు... మహారాష్ట్ర అంతటా పేరున్న వైద్యుడు. 


    అమ్మ జయశ్రీ ఆప్టే పేరున్న  వైద్యనిపుణురాలు. ఈమె, ఇద్దరు తమ్ముళ్ళు - మొత్తం ముగ్గురు సంతానం. ఈవిడ లండన్‌లో నృత్యం నేర్చుకుని రంగస్థలం మీద నటిస్తూ, అటు నుంచి మరాఠీ రంగానికీ, హిందీ సినీ రంగం లోకి అడుగుపెట్టింది.


    ఈవిడ సినిమాలు చూసి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహాయకులెవరో చెప్పడంతో, ఆయన ‘రక్తచరిత్ర’ సినిమాకు స్వాగతం చెప్పారు.


    తర్వాత అందులో ఎంపికై రక్తచరిత్ర సినిమాలో నటించింది.సినిమాలలోకి రాకముందే 2002 నుండి రంగస్థల నటిగా చేస్తుంది. 


    మరాఠీ, హిందీ, ఇంగ్లీషుల్లో ప్రయోగాత్మక నాటకాలలో నటించింది. వీరి సొంత ఊరు పుణేలో చాలా నాటక సంస్థలతో కలసి పనిచేసింది.


    7 సెప్టెంబర్ 1985న జన్మించిన రాధికా ఆప్టే ఒక భారతీయ చలనచిత్ర మరియు రంగస్థల నటి, ఆమె తొలిసారిగా చలనచిత్రం వాహ్! లైఫ్ హో తో ఐసి, షాహిద్ కపూర్ మరియు అమృతా రావు నటన కలిసి స్టార్ట్ చేసింది. 


    బద్లాపూర్ మరియు ఫోబియా వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించడమే కాకుండా , ఆప్టే అనేక బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం మరియు మలయాళ చిత్రాలలో కూడా చేసారు.


    సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక ఇంటర్వ్యూలో నటి తెలుగు పరిశ్రమలో పనిచేసిన అనుభవం గురించి మాటల్లో తెలిపింది.


    రాధికా ఆప్టే తన 14 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు పలు భాషలతో సినిమాల్లో నటించింది. మరియు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఇంటర్వ్యూలో, ఆమె తెలుగు పరిశ్రమలో పనిచేసిన అనుభవం గురించి మాటల్లో తెలిపింది.






    No comments