• Breaking News

    వామ్మో ప్రియాంక చోప్రా దానికోసం అంత పని చేస్తుందా ....

     ప్రియాంక చోప్రా 1982 జూలై 18 న జన్మించింది.ఈమె మాజీ మిస్ యూనివర్స్. తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు, మోడల్‌గా పనిచేసిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకుంది.



    ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తరువాత ప్రియాంక  నటి అయ్యింది. 2002వ సంవత్సరంలో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ ద్వారా చిత్రసీమలోకి రంగప్రవేశం చేసింది. 

    ప్రియాంక  తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 



    రెండో చిత్రం నుండే ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో నిలదొక్కుకుంది. ఒక దశలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పరిశ్రమను ఏలింది. 


    2018లో అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా ప్రేమ వివాహం చేసుకుంది. నిక్ ప్రియాంక కన్నా పది సంవత్సరాలు చిన్నవాడు.తనకంటే చాల చిన్నవాడ్ని పెళ్లి చేసుకుందని ఆమె మీద చాల నెగటివ్ కామెంట్స్ చేసేవారు.



    కాగా హాలీవుడ్ కి వెళ్లిన కొత్తల్లో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రియాంక చెప్పడం విశేషం. ఆమె మాట్లాడుతూ హాలీవుడ్ లో నా కెరీర్ ఫస్ట్ నుండి మొదలైంది. అక్కడ నాకు ఎవరూ తెలియదు. ఇండియాలో నేను స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఒక డెబ్యూ హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేశాను అని చెప్పింది.


    హాలీవుడ్ కి వెళ్లిన  క్రమంలో భయం వేసింది. చాల వ్యతిరేకత  ఎదురైంది.. నేను ఒక స్టార్ హీరోయిన్ అనే భావన పక్కన పెట్టి ముందుకు వెళ్ళాను. అందుకే హాలీవుడ్ లో ఈ స్థాయిలో ఉన్నాను.. అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. 


    బేవాచ్, ఏ కిడ్ లైక్ జేక్, ఈజ్ ఇన్ ఇట్ రొమాంటిక్ తో సహా పలు హాలీవుడ్ చిత్రాల్లో ప్రియాంక చోప్రా నటించింది. యాక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో సైతం నటించి ఒరా అనిపించి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయింది.


     ఒక్క సినిమాకే ఏకంగా రూ.40 కోట్లు వసూలు చేస్తూ టాప్ బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, అలియా భట్, కరీనా, కత్రినా వంటి వారందరినీ మించిపోయింది. ఆమె ఎవరో కాదు మన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.

    స్టార్ హీరో రెమ్యునరేషన్ కన్నా మన ప్రియాంక రెమ్యునరేషన్ చాల ఎక్కువగా డిమాండ్ చేస్తుంది.ఆమె ఒక్కో సినిమాకు 50 నుండి 60 కోట్లు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది.

    No comments