• Breaking News

    అసిన్ ఏలాఫేమస్ అయ్యింది ?

     ఆసిన్ తొట్టుంకల్ జ. 1985 అక్టోబర్ 26 భారతీయ నటీమణి. ఈమె తమిళ, తెలుగు హిందీ సినిమాల్లో  నటించింది. 




    అసిన్ భరతనాట్యంలో శిక్షణ పొందిన నర్తకి. అసిన్  మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందింది. మొదటగా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో నటన ప్రారంభించిన ఈమె తర్వాత బాలీవుడ్ లో నటించడం మొదలు పెట్టింది.


    అసిన్ ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. తన డబ్బింగ్ తానే చెప్పుకోగలదు. అసిన్ పద్మిని తర్వాత అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకున్న మలయాళీ నటి ఈమే. 2007 లో ఆన్ లైన్ తమిళ సినిమా పత్రికలు ఈమెను క్వీన్ ఆఫ్ కాలీవుడ్ అని తెలిపారు.


    హీరోయిన్ అసిన్ ప్రముఖ వ్యాపార వేత్త రాహుల్ శర్మను పెళ్లాడిన సంగతి తెలిసిందే.


    బయట కనిపించకుండా, సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా లేకుండా అసిన్ ఏం చేస్తోంది మీకు తెలుసా?

    అంటే..... ఆమె పూర్తి తన కూతురు అరిన్ బాధ్యతలు చూసుకోవడంపైనే సమయం గడుపు తోంది.
    అరిన్ జన్మించిన ఈ అక్టోబర్ 24, 2018తో సరిగ్గా సంవత్సరం పూర్తయింది. 


    అసిన్-రాహుల్ శర్మ దంపతులు తమ కుమార్తె ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్‌గా జరుపుకున్నారు. అసిన్ సోషల్ మీడియా పేజీల్లో కొత్తగా పోస్టులు పెట్టినట్లు నోటిఫికేషన్ రావడంతో అవేమిటని ఓపెన్ చూసిన ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.


    అసిన్   కూతురు అరిన్ ఫస్ట్ బర్త్ డే ఫోటోలను, వీడియోలను ఆమె అభిమానులతో షేర్ చేసింది.


    అరిన్ లుక్ అచ్చం అసిన్ మాదిరిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.




    No comments