• Breaking News

    ప్రేమలు హీరోయిన్ మమతబైజు లేటెస్ట్ క్యూట్ ఫొటోస్

     ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మలయాళం సినిమా ప్రేమలు హీరోయిన్ ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. 


    మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో మమత బైజు కూడా ఒకరు.


     ప్రేమలు సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.తాజాగా ఈ అమ్మడుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


    ఈ వీడియోలో మమితా ఏదో వివాహ వేడుకలలో డాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఈమె ఎనర్జీ కి కుర్రకారులు , అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.


    ప్రేమలు సినిమాలో మమత బైజు పెర్ఫామెన్స్ కి అందరూ ఫాన్స్ అయిపోయారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో మమత బైజుకి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు మమతని తెలుగులో ఇంటర్డ్యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


    తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.VD12 వర్కింగ్ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మమిత బైజుకి అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.


    VD12 సినిమాలో మమిత హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్ లో కచ్చితంగా మమత బైజు దశ తిరిగినట్లే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కథలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమట.


    ప్రేమలు సినిమా కంటే ముందు మలయాళంలో చాలా చిత్రాల్లో నటించింది. అంతుకు ముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. ఇప్పుడు సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాకు తన కెరీర్ లో 16వ మూవీ అని పేర్కొంది.


    తెలుగు సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఎక్కువగా అల్లు అర్జున్ చిత్రాలు చూసేందుకు ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.

    No comments