• Breaking News

  బాయ్ ఫ్రెండ్ తో చక్కెర్లు కొడుతూ కెమెరా కి చిక్కిన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే

   టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది.ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్ని ప్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.


  పూజా హెగ్డే ఏ భాషల్లో సినిమాలు చేసినా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. సినిమాల్లో అందాలు ఆరబోసినా బ్లాక్ బస్టర్స్ కావడం లేదు.అయినప్పటికి కొత్త సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. 


  పూజా రీసెంట్‌గా ముంబై బాంద్రాలో ఇల్లు కొనుక్కున్నారు. ఈమె చాల విలాసవంతమైన ఇల్లు కొన్నట్టు బాలీవుడ్ వర్గాలలో సమాచారం.


  పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఈ అమ్మడు కారులో వెళ్తున్నప్పుడు ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


  కారులో ఆమెతో పాటు ఎవరో ఉండడంతో అందరు పూజ తన బాయ్ ఫ్రెండ్ తో బానే చక్కర్లు కొడుతోంది కదా అని గుసగుసలాడుతున్నారు.


  పూజా హెగ్డే పెళ్లి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.నటుడు రోహనా మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. 


  ఇటీవల ఈ జంట ముంబైలోని బాంద్రాలో కలిసి కనిపించింది. ఈ జంట గతంలో ముంబైలో చాలాసార్లు కలిసి కనిపించింది. రోహన్ మెహ్రా దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు.


  ఈ ఇద్దరూ  కోవిడ్ టైం నుంచి ప్రేమలో ఉన్నారని , తమ ప్రేమను చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారని బీ టౌన్ లో టాక్. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ఓపెన్ గా తిరుగుతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. 


  పూజా హెగ్డే రీసెంట్ గా షేర్ చేసిన హాట్ పిక్స్ కి లక్షల్లో లైక్ లు వస్తున్నాయి. స్టన్నింగ్ లుక్స్ కి కుర్రాళ్లు విలవిల్లాడిపోతున్నారు. పిచ్చి పిచ్చి కామెంట్స్ షేర్ చేస్తున్నారు. కొందరైతే పూజాహెగ్డే అందాల్ని వర్ణిస్తున్నారు.

  No comments