గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్
రిచా గంగోపాధ్యాయ ఈపేరును తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఈ అందాల ముద్దుగుమ్మ శేఖర్ కమ్ముల, రానా కాంబినేషన్‌లో వచ్చిన లీడర్‌తో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత హాట్,హాట్ అందాలతో రవితేజ మిరపకాయ, ప్రభాస్ మిర్చి వంటి సినిమాల్లోఅదరగొట్టిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అదిరిపోయే ఆఫర్స్‌తో దూసుకుపోతున్న సమయంలోనే నటనకు బైబై చెప్పి, హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లింది.
ప్రభాస్ సరసన నటించిన మిర్చి సినిమాతో సూపర్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ సక్సెస్‌ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది.
రిచా 2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించింది. ఆ సినిమా తర్వాత ఇక తెలుగులో నటించలేదు. అదే ఆమె చివరి సినిమాగా నిలిచింది. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్ జో లాంగేల్లాను ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.
వీరికి 2021లో లూకా షాన్ లాంగెల్లా అనే బాబు జన్మించాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రిచా.. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనక కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది.
ఇక తాజాగా రిచా లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఫంక్షన్ లో భర్త, బిడ్డతో కలిసి ఇదుగో ఇలా దర్శనమిచ్చింది. నీలం రంగు లంగావోణీలో రిచా ఎంతో అందంగా కనిపించింది. పెళ్లి తరువాత రిచాలో చాలా మార్పొచ్చింది. కొద్దిగా బొద్దుగా మారింది.
No comments