• Breaking News

    నివేదా థామస్ క్యూట్ లుక్స్

     నివేదా థామస్ కేరళ లో కన్నూర్ లో  జన్మించారు. తమిళనాడులో  చెన్నై లో స్థిరపడారు. ఈమె నటి, మోడల్ గా పనిచేసారు. ఎక్కువగా మలయాళం,  తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు.


     జెంటిల్ మేన్ సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యింది.తరువాత నిన్ను కోరి, జై లవకుశ  సినిమాల్లో నటించింది.


    మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది నివేదా థామస్. తమిళ్ , మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది.


    ఆ తర్వాత కూడా నాని తో మరో సినిమా చేసింది. నిన్నుకోరి సినిమాలో హీరోయిన్ గా చేసింది నివేదా థామస్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. 


    ఈమె చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన సినిమాలతో కంటే నెట్టింటే బాగా అలరిస్తున్నారు. 


    2022లో శాకిని డాకిని సినిమానే ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తప్ప వెండితెరపై కనిపించింది లేదు. అయితే అందుకు కారణం ఏంటి అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు.

    అప్పట్లో నివేథా కొద్దిగా బరువు పెరగడం వలన సినిమాలుకు కొంత గ్యాప్ ఇచ్చిందని, ఆమె బరువు తగ్గి మళ్ళీ కనిపిస్తుందని పుకార్లు బయటికి వచ్చాయి. 


    నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంది. యాచకురాలిగా, మల్టీ షేడ్స్ ఉన్న సైకోగా, డీ గ్లామరైజ్ పాత్రల కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


    నివేదా తన సోదరుడితో కలిసి వేసే స్టెప్పులు, చేసే డ్యాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అయితే ఈ మధ్య నివేదా కాస్త లావుగా మారింది. దీంతో ఆమె మీద బాడీ షేమింగ్, ట్రోలింగ్ జరుగుతుంది.

    No comments