• Breaking News

    అందాలు ఆరబోస్తూన్న నిధి అగర్వాల్

     నిధి అగర్వాల్ 17 ఆగస్ట్ 1993 సంవత్సరం లో  హైదరాబాద్ లో జన్మించారు.కానీ నిధి బెంగళూరు లో పెరిగింది. నిధి శ్రీ విధ్యనికేతన్ స్కూల్ లో చదివింది క్రైస్ట్ యునివర్శిటి బిసినేస్ మెనేజ్మెంట్ లో డిగ్రీ పొందింది. 


    తొలుత మోడలింగ్ రంగాన్ని ఎంచుకొని ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.


    సవ్యసాచి  సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది నిధి అగర్వాల్. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టనప్పటికీ నిధి అందం, అభినయానికి తెలుగు ప్రేక్షక లోకం ఫిదా అయింది. దీంతో దర్శకనిర్మాతల కన్ను ఆమెపై పడింది.


    ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన  ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి  భారీ క్రేజ్ కొట్టేసింది. ఈ మూవీ సక్సెస్ తో నిధి ఒక్కసారిగా స్టార్ అయిపొయింది.ఆ తర్వాత సినీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా టర్న్ తీసుకోలేదు.



    నిధి అగర్వాల్ తెలుగులో చిన్నా, పెద్ద తేడా లేకుండా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అందరి హీరోల సరసన నటించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.


    ఈ మధ్యే తమిళనాడులో ఈమెకు అభిమానులు గుడి కూడా కట్టారు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు,ఇతర ఇండస్ట్రీలపై కూడా బాగానే కన్నేసింది నిధి.


    .ముఖ్యంగా తమిళంలో అయితే  నిధికి మంచి ఛాన్సులు వస్తున్నాయి. అక్కడ స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


    అందాల గేట్లు పూర్తిగా ఎత్తేసి హాట్ ట్రీట్ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ స్టన్నింగ్ అవతార్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్ అందమంటే నిధిదే అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.


    ప్రతి హీరోయిన్ ఇన్ స్టాగ్రాం లో ఫోటో షూట్స్ చేస్తుంటారు. కానీ కొందరికి మాత్రమే రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు. అలాంటి భామల్లో నిధి అగర్వాల్ ఒకరు. లేటెస్ట్ గా అమ్మడు మూన్ లైట్ కలర్ శారీలో అందాలను వెదచల్లుతుంది. 



    కట్టింది శారీనే అయినా ఆమె చేస్తున్న గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక నిధి చేసిన ఈ ఫోటో షూట్స్ కి నింగిలోన చందమామ భూమీదకు వచ్చిందేంటి అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

    No comments