• Breaking News

    నాజ్రియా నజిమ్ లవ్ స్టోరీ మీకు తెలుసా....

     నజ్రియా నజీమ్ 20 డిసెంబర్ 1994 లోపుట్టింది.ఈమె ప్రధానంగా  మలయాళం మరియు తమిళ చిత్రాలలో నటించిన భారతీయ చలనచిత్ర నటి. నటిగా కెరీర్‌ను కొనసాగించే ముందు ఆమె టీవీ షో యాంకర్‌గా ఉండేది.


    రాజా రాణి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన న‌జ్రియా న‌జీమ్‌ త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ప‌లు హిట్ చిత్రాల్లో నటించారు. ఈ మూవీ లో ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు.


    తొలుత వెండితెరపై భార్య భర్తలుగా నటించిన ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ ఆ తర్వాత నిజ జీవితంలోనూ భార్య భర్తలుగా మారారు. ‘బెంగుళూరు డేస్’లో కలిసి నటించిన ఈ జంట ప్రేమలోపడి పెళ్లితో ఒక్కటైంది.

    మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఫహద్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది నజ్రియా. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి ‘ట్రాన్స్’ అనే సినిమాలో నటించారు. 


    ఫహద్ తో ప్రేమ, పెళ్లి గురించి ముందుగా చెప్పింది నజ్రియా. సినిమా సెట్ లోనే ఫహద్ దగ్గరికి వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగిందట. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ చెప్పారు.

    నాతో ఎవరూ కూడా ఇలాంటి మాట చెప్పలేదు అంటూ ఫాహద్ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.నాజ్రియా మాట నచ్చడం తో వెంటనే ఆమెను పెళ్లి చేసుకున్నారు.


    వివాహం తర్వాత నజ్రియా నటనకు దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుంది. తన వివాహ జీవితంపై దృష్టి పెట్టింది. ఆ సమయంలో ఫహద్ ఫాసిల్‌ ను వెనకుండి మంచిగా సపోర్ట్ చేస్తూ, తన కెరీర్ కి ప్లస్ అయింది.


    ఇక తాజాగా నజ్రియా ఓ సడెన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట బ్యూటీ. నెట్టింట్లో నుంచి బయటకు రావాలని ఆమె డిసిషన్ తీసుకున్నట్టు సమాచారం. నిశ్చయించుకున్నారు.


    నేను నా అన్ని సోషల్‌ మీడియా ఖాతాల ప్లాట్ ఫామ్స్ నుంచి బ్రేక్‌ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ, సందేశాలను చాలా మిస్‌ అవుతాను. నేను మళ్లీ తిరిగి వస్తాను. అని పోస్ట్ చేసింది.


    No comments