• Breaking News

    అభిమాని కారవాన్ లోకి వచ్చి అలా చేయడం తో షాక్ తిన్న కాజల్ అగర్వాల్

     టాలీవుడ్ అందాల చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 


    చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.


    ప్రస్తుతం కాజల్ నటించిన సత్యభామ సినిమా మే 31న రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది కాజల్.


    తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులు, సంఘటనలను గుర్తు చేసుకుంది.కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‏లో పాల్గొన్నానని,తొలిరోజు షూటింగ్ కంప్లీట్ కాగానే ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ తన అనుమతి లేకుండానే తన క్యారవాన్ లోపలి వచ్చాడు అని చెప్పింది.


     ఆయన  కారవాన్ లోపలి రాగానే తనను చూసి షాక్ ఐపోయిందంట.అయితే ఆటను మాత్రం తన షర్ట్  విప్పి,తన ఛాతీపై ఉన్న తన పేరును టాటూని చూపిస్తూ తనకు పెద్ద అభిమానని చెప్పాడని గుర్తుచేసుకుంది.


    ఎవరు లేని సమయంలో అతడు అలా చేయడంతో తాను భయపడ్డానని,అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో చూపించినందుకు ఆనందంగా ఉన్నా,అలా చేయడం కరెక్ట్ కాదని సున్నితంగా హెచ్చరించి పంపించినట్లు చెప్పుకొచ్చింది. 



    కాజల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.


    ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతం గా ఉంది. ప్రస్తుతం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరుగా నిలిచింది.


    కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది.

    No comments