• Breaking News

    అలాంటి సినిమాలు చేయను అంటున్న మెగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి

     లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో పెరిగింది.ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది.


     ఆమెకు ఒక సిస్టర్ , ఒక బ్రదర్ కూడా ఉన్నారు. మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా  అందుకుంది.


    ఆమె 2006 లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలిచిన తరువాత బాగా ఫేమస్ అయింది.దీని తర్వాత ఆమె తన ఎడ్యుకేషన్ పూర్తి చేసి సినీ రంగం లోకి ప్రవేశించారు.


    2012 లో  తెలుగు చిత్రం అందాల రాక్షసితో ఆమె టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది.

    ఆ తరువాత రాధా, మిస్టర్, సొగ్గాడే చిన్నినాయన, లచ్చిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తూ శుభమస్తు, భలే భలే మగాడివోయి, దూసుకెళ్తా వంటి చిత్రాలలో నటించింది. 


    ఇటీవల మెగా కుటుంబంలోకి అడుగుపెట్టింది యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. వెండితెరపై అందాల రాక్షసిగా కుర్రకారు మనసు దోచేసిన ఈ బ్యూటీ,మెగా వారసుడు వరుణ్ తేజ్‌ని పెళ్ళాడి ప్రస్తుతం వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

    మెగా కోడలయ్యాక మెగా ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమా ఆఫర్స్ ఓకే చేయాలని లావణ్య అనుకుంటుంది.మెగా ఫామిలీ కోడలిగా ఫ్యాన్స్‌ని నొప్పించే ఏ పని చేసినా అది పెద్ద రచ్చ అయ్యే ప్రమాదం ఉందని అనుకుంటోందట.


     ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడం పక్కా అని, కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా అవి అన్ని చూసుకొని సినిమాలు చేస్తా అని చెప్తుంది ఈ మెగా హీరోయిన్.


    పెళ్లి తర్వాత తన ప్రొఫెషన్ కి తగ్గట్టుగా ప్లాన్స్ చేసుకుంటున్న లావన్యా  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ షేర్ చేస్తూ బిజీ గా గడుపుతుంది.


    No comments