• Breaking News

    ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశా అంటున్న చందమామ

     కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.


    వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్కుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా మారింది. 



    ఈమె చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది.


    ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోస్ అందరీ సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా తనదైన ముద్రను వేసుకుంది కాజల్. ఇక ఈమె అందం, అద్భుతమైన నటనకుగాను ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చందమామ.



    అలీ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ గెస్ట్ గా వచ్చింది. ఇక ఆ ఎపిసోడ్ కు సంబంధించిప్రోమో తాజాగా రిలీజైంది. కాగా, ఆ షోలో కాజల్ కి  ఓ ప్రశ్న ఎదురవ్వడంతో,ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది.


    ఎన్టీఆర్ జనతా గ్యారెజ్ సినిమాలో ఐటెంసాంగ్ చేయడానికి కారణం ఏమిటని అలీ ప్రశ్నించగా, అందుకు కాజల్ చాలా ఆసక్తికరంగా జవాబు తెలిపింది. 


    ఆ సాంగ్ నేను చేయడానికి కారణం కేవలం కేవలం పెద్ద బ్యానర్‌,పెద్ద డైరెక్టర్, మంచి రెమ్యునరేషన్  కాదు అని,దానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది కాజల్. ఇక తన కోసమే ఆ పాటలో నటించడానికి తాను ఒప్పుకున్నట్లు కాజల్ చెప్పింది.


    సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ గానే ఉంది. ప్రస్తుతం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరుగా నిలిచింది. కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది.


    కాజల్ లేటెస్ట్ పిక్స్ చూసిన వాళ్లంతా ఆమె గ్లామర్ మరింత పెరిగిందనే చెబుతున్నారు. గతంలో  కంటే ఇప్పుడే మరింత అందంగా కనిపిస్తోందని అంటున్నారు.

    No comments