• Breaking News

    ఎట్టకేలకు పెళ్లి,ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన ఇలియానా

     ఇలియానా గురించి స్పెషల్ గా చెప్పాలిసిన అవసరం లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.


    ఈ గోవా బ్యూటీ దేవదాసు చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది.ఆ తరువాత పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి సినిమా లో నటించే అవకాశం వచ్చింది.


    పోకిరి సినిమా కూడా మంచి సక్సెస్ అయింది.ఈ సినిమా ఇండస్ట్రీ  రికార్డ్స్ బద్దలు కొట్టింది.ఈ సినిమాతో ఇల్లి బేబీ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది.


    కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో ఈ భామ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్ ఆఫర్స్ కొల్పోయింది. బాలీవుడ్ లో వరుస ప్లాప్స్ రావడంతో అక్కడ ఎవరు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.


    ఇక ఇటీవల సడెన్‌గా తాను ప్రెగ్నెంట్ అంటూ, బేబీ బంప్ ఫోటోలు పెట్టి అందరికీ షాకిచ్చింది. రీసెంట్‌గా బిడ్డకు జన్మనిచ్చి కూడా నెట్టింట వైరల్ అయింది.


    ఇక తల్లిగా ఫుల్ బీజీగా ఉన్న ఈ బ్యూటీ,మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అయింది. దో ఔర్ దో ప్యార్ సినిమాతో మళ్లీ బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యింది.


    ఇక ఈ  క్రమంలోనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయం చెప్పేసింది.తన పెళ్లి గురించి, తన భర్త గురించి చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటీ.ప్రస్తుతానికి నా వైవాహిక జీవితం బనే వుంది అని,నా కష్ట సమయాల్లో,నా ఆనంద క్షణాల్లో ఎప్పుడూ నాకు తోడుగా నా భర్త ఉంటాడు అని చెప్పింది.


    ఇలియానా 2023 ఆగస్ట్‌ 1వ తేదిన పండంటి మగబిడ్డకు జన్మను ఇచ్చినట్లు తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో పంచుకుంది. తన కొడుక్కి కోవా ఫీనిక్స్ డోలన్ అంటూ ఓ పేరు పెట్టింది



    No comments