• Breaking News

    ఆ సినిమా లో నాకు అన్యాయం జరిగింది అంటున్న ఈషారెబ్బ

     కొంత మందికి ఎంత అందం, అభినయం ఉన్న సరైన అవకాశాలు మాత్రం రావు. అలాంటి భామల్లో ఈశా రెబ్బ ఒకరు. ఆకట్టుకునే గ్లామర్ ఉన్న ఇప్పటికీ సరైన బ్రేక్ ఈవెన్ లభించలేదు. 


     ఈషా రెబ్బ మన తెలుగు అమ్మాయే.ఈమె వరంగల్ లో పుట్టింది.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆ తర్వాత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.


     హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేసింది ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. అందుకే సినిమాలతో పాటు ఓటీటీల్లో తన లక్ పరీక్షించుకుంటోంది.


    ఇటీవలే త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో ఈషా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి.


    అందం,అభినయం వున్నా ఈషా కి మాత్రం తెలుగు సినిమాలలో అవకాశాలు రాలేదు.దీనికి కారణం ఆమె తెలుగు అమ్మాయి అవ్వడం వలెనే అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్.


    ఈషా అరవింద సమేత మూవీ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఆమె పాత్ర కు ఎటువంటి ప్రాధాన్యత లేదు.ఈ సినిమాలో ఆమె కు మంచి పాత్ర అని చెప్పి,ఇలాంటి స్కోప్ లేని పాత్ర ఇచ్చి తనకు అన్యాయం చేసారు అని ఈషా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.


    తెలుగు అందం ఈషా రెబ్బా,హాట్‌నెస్‌కి కేరాఫ్‌. ఆమె  అందాలతో పిచ్చెక్కిస్తుంటుంది.ఈషా గ్లామర్‌ డోస్‌ పెంచితే ఇంటర్నెట్‌ బ్రేక్‌ కావాల్సిందే. 


    కావాల్సినంత అందం ఉన్నా, ఈషా రెబ్బకు  మాత్రం తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి.  అందుకే వెబ్ సిరీస్‌లతో పాటు పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందం.


    ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు ఒట్టు అనే తమిళం, మలయాళం కూడా ఒక సినిమా  చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల ఫలితాలు అయినా ఈషా ని టాప్ హీరోయిన్ చేస్తాయో లేదో చూడాలి.


    సోషల్ మీడియాలో ఈషారెబ్బా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్,పర్సనల్ లైఫ్ అన్ని షేర్ చేస్కుంటూ  ఉంటుంది.

    No comments