• Breaking News

    ఎట్టకేలకు తన ప్రేమ,పెళ్లి పై నోరు విప్పిన హీరోయిన్ అంజలి

     అంజలి తూర్పు గోదావరి జిల్లా లో మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986 వ సంవత్సరం లో పుట్టారు.ఈమెకు ఇద్దరు అన్నయ్యలు , ఒక అక్క ఉన్నారు. 


    హీరోయిన్ అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది..ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది.


     సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీత పాత్రను మద్రించింది అంజలి. అప్పటి నుంచి తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచింది.


    వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్‌లో కూడా  స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత తెలుగులో కూడా వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది.



    అంజలి జర్నీ సినిమా లో తనతో కలిసినటించిన హీరో  జైతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో వుంటున్నారు అని కూడా అప్పట్లో సంచలనం రేపింది..


    ఇంతవరకూ తన ప్రేమపై పెదవి విప్పని అంజలి, ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ  విషయంపై మాట్లాడి సంచలనం సృష్టించింది.


     ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్ షిప్ వల్ల కెరీర్ పై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నానని, ఆ సంబంధం రాంగ్ రిలేషన్ షిప్ అని అంజలి తెలిపింది. తన కెరీర్‌కి అడ్డుగా ఉన్న రిలేషన్‌షిప్ కంటే కెరీర్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదని నటి అంజలి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 


    అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మళ్ళీ ప్రచారం మొదలైంది. ఆమె త్వరలో ఓ తెలుగు సినిమా బడా  నిర్మాతను పెళ్లి చేసుకోనుందని అంటూ ప్రచారం సాగుతోంది.


    ఈ వార్తలపై ఆమె స్పందిస్తేనే కానీ నిజం ఏమిటో తెలీదు.ఇకపోతే అంజలి ప్రస్తుతానికి తెలుగు,తమిళం భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా గడుపుతుంది.

    No comments