విదేశాల్లో..... ప్రియా ప్రకాష్ వారియర్
కన్నుగీటిన సీన్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ .
ఈ ఒక్క సీన్ ప్రియా ప్రకాశ్ కు మంచి పాపులారిటీ మంచి పేరు తెచ్చిపెట్టింది.
నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక స్టిల్‌ను షేర్ చేస్తూ అందరినీ పలుకరిస్తుంటుంది.
తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ వెకేషన్ టూర్‌లో బిజీగా ఉంది. బ్యాంకాక్‌లో తన స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు చేస్తుంది.
అక్కడ వీధులన్నీ తిరుగుతూ తెగ సందడి చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్‌లలో కనిపిస్తూ..
అటూ ఫ్యాన్స్‌తో పాటు ఇటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా టూర్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా..
ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక నితిన్‌తో కలిసి తొలిసారి తెలుగు సినిమా చెక్ 2022లో మెరిసింది ప్రియా వారియర్.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత తేజా సజ్జా హీరోగా, ప్రియా హీరోయిన్‌గా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ఇష్క్ చిత్రం కూడా..
అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రియా వారియర్ ఆశలన్నీ పవన్ కల్యాణ్ నటిస్తోన్న బ్రో
చిత్రం పైనే.. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం జులై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకు రెడీ అవుతుంది.
No comments