వెస్టిండీస్ క్రికెటర్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయిన మన చిన్నారి పెళ్లికూతురు
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టింది అవికా గోర్.
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ సినిమాలో అవికా నటనకు మంచి మార్కులు పడ్డాయి.మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తరువాత కూడా రాజ్ తరుణ్ తో కలిసి రెండవ సినిమా,సినిమా చూపిస్తా మామ లో రెండవసారి జతకట్టింది..ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.తను నటించిన సినిమాలన్నీఅనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు.
తెలుగులోనే కాకుండా,కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సినిమలు చేస్తుంది.
ఓ వైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు ఆల్భమ్‌లలో నటిస్తున్నాడు ఆండ్రీ రస్సెల్. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్భమ్ చేశాడు. ‘లడ్కీ తు కమాల్ కీ’ అంటూ సాగే హిందీ ఆల్బమ్‌లో అవికా గోర్‌తో కలిసి రస్సెల్ హుషారైన స్టెప్పులు వేసి అలరించాడు. అంతేకాదండోమ్ పాటని కూడా రస్సెల్ పాడుతూ అందర్నీ అలరించాడు.
ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్న అవికాగోర్ కొంతకాలంగా నెట్టింట్లో ఆక్టివ్ గా ఉంటూ,కొత్త కొత్త అప్ డేట్స్ ను షేర్ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు.
No comments