చీర కట్టులో లో అందాలు ఆరబోస్తున్న హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్...
దళపతి విజయ్ హీరోగా వచ్చిన విజిల్ సినిమాతో టాలీవుడ్ లో కనిపించింది అమృత అయ్యర్. ఇక తెలుగులో రెడ్ అనే సినిమాలో కూడా నటించింది.
యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.దీనితో ఆమెను ఆఫర్లు క్యూ కట్టాయి.
తాజాగా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు,ఇప్పుడు కాస్త బిజీగా కనిపిస్తుంది. హనుమాన్ సినిమా సక్సెస్ తో ఈ అమ్మడి కెరీర్ బానే ఊపు అందుకుంది.ఈ సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపొయింది.
బెంగళూరుకు చెందిన అమృత అయ్యర్ వరుస తెలుగు చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది. కోలీవుడ్ లో ఆయా పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటీ,ఇక తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ ఇక్కడి ఆడియెన్స్ కు దగ్గరవుతోంది.
అందం, అభినయం కలిగిన ఈ భామా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
No comments