కాఫీకి పిలిచి ,గదిలోకి తీసుకెళ్లాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విద్యాబాలన్......
ఒకే ఒక్క సినిమాతో విద్యాబాలన్ పేరు మారుమ్రోగిపోయింది. బోల్డ్ కంటెంట్ సినిమాను ఒప్పుకొని అద్భుతంగా నటించిన ఈ అమ్మడి ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. డర్టీపిచర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
డర్టీ పిక్చర్ సినిమాలో ఈ అమ్మడు అందాల ఆరబోత మామూలుగా ఉండదు.ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో కూడా ఎలాంటి హద్దులు లేకుండా నటించి,అందరి హృదయాల్ని కొల్లగొట్టింది.
డర్టీ పిక్చర్ సినిమాతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.కానీ ఆమె మాత్రం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
నేను ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్ ను కలవడానికి చెన్నై వెళ్లాం. అక్కడ ఓ కాఫీ షాప్ లో దర్శకుడితో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పా. అయితే అతను నన్ను రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందాం అని పదే పదే అడిగాడు.
అతని ఆలోచన ఏమిటనేది నాకు అర్థమైంది. నేను అప్పుడు తెలివిగా గది లాక్ వేయకుండా కొంచెం తెరిచి ఉంచా. అందుకే ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు అని తెలిపింది.
తాను అప్పుడు సమయస్పూర్తిగా ప్రవర్తించడం వల్లే ఆ పరిస్థితి నుంచి తప్పించుకోగలిగానని చెప్పింది. అయితే ఆ సినిమా నుంచి తప్పుకున్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పింది. అప్పుడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అవ్వబోతున్నానని అర్థమైందని చెప్పుకొచ్చింది విద్యా.
ఇక ప్రస్తుతం విద్యాబాలన్ నాలుగు పదుల వయసు దాటినా కూడా తన గ్లామర్ తో వరుస సినిమాలు చేస్తోంది. 2005లో వచ్చిన పరిణీత సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2011 లో వచ్చిన డర్టీ పిక్చర్’సినిమాతో ఆమె సినిమా కెరీర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తోంది.
విద్యాబాలన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నటి తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
No comments