కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ అమల పాల్
అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్, తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించింది.
ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది.
తండ్రి వర్గీస్ పాల్ కేంద్రప్రభుత్వ ఉద్యోగి, తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె టాబ్ విద్యాభ్యాసాన్ని కొచ్చి లో పూర్తిచేసింది.
ప్రేమ ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అమలాపాల్.ఆ తరువాత ధనుష్, రామ్ చరణ్, దళపతి విజయ్ ల సరసన నటించింది. కమర్షియల్ సినిమాలలో నటించింది.
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆమె అనే సినిమాలో ఏకంగా నగ్నంగా నటించి షాక్ ఇచ్చింది.
అమలాపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత మొగుడితో కలిసి తెగ ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది గర్భం దాల్చింది. బేబీ బంప్ తో ఫోటోలు షేర్ చేస్తుంది.
ఈమె ఇప్పుడు కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది అని ప్రచారం జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.
అమలాపాల్ సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. హిందీ సినిమాలకు సైతం అమలాపాల్ ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలో అమలాపాల్ మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.
No comments