400/- రూపాయలు సేవ్ చేసిన సారా అలీ ఖాన్ ......
సారా అలీ ఖాన్ బాలీవుడ్ చిత్రసీమకు భారతీయ నటి. సారా అలీ ఖాన్ నటులు అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల కుమార్తె.
కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో చదువు పూర్తిచేసిన తరువాత , సారా అలీ ఖాన్ తన నటనా జీవితాన్ని 2018లో రొమాంటిక్ డ్రామా కేదార్‌నాథ్, యాక్షన్ కామెడీ సింబాలతో మొదలు పెట్టింది.
ఈ రెండు చిత్రాలు వాణిజ్యపరంగా ఘన విజయం సాధించింది.సారా అలీ ఖాన్ పటౌడీ 12 ఆగస్టు 1995 బాలీవుడ్ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి . ఖాన్ ఫోర్బ్స్ ఇండియా యొక్క 2019 సెలబ్రిటీ 100 వరుసలో ఉన్నారు.
రెండు పేలవమైన ఆదరణ పొందిన చిత్రాల తర్వాత, ఆమె అత్రంగి రే 2021 డ్రామాలో నటించింది రొమాంటిక్ కామెడీ జరా హత్కే జరా బచ్కే 2023 లో వాణిజ్యపరంగా విజయం పొందారు.
అయితే సారా అలీ ఖాన్ కోసం అందరు గుసగుసలాడుకుంటున్నారు కేవలం 400 రూపాయల కోసం వెరైటీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అవుతోంది, దీనికోసం ప్రస్తావించగా.
తాజాగా ఈ హీరోయిన్ మాట్లాడుతూ ఒక స్టార్ హోటల్ లో తనకు ఎదురైన అనుభవం గురించిచెప్పారు.ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లగా అక్కడ రోమింగ్ కోసం 400 రూపాయలు చెల్లించాలని హోటల్ వాళ్లు అడిగారని సారా అలీ ఖాన్ చెప్పుకొచ్చారు.
ఒక్కరోజు రోమింగ్ కోసం అంత మొత్తం చెల్లించాలా అని తాను తన మేకప్ మ్యాన్ ను హాట్ స్పాట్ ఆన్ చేయాలని కోరానని సారా అలీ ఖాన్ చెప్పారు.
నా దృష్టిలో డబ్బులను పొదుపు చేస్తే రెట్టింపు సంపాదించినట్టే సారా అలీ ఖాన్ తెలిపారు.సారా అలీఖాన్ చేసిన కామెంట్లపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
సారా అలీ ఖాన్ డబ్బుకు ఎంతో విలువ ఇస్తారని సారా అలీ ఖాన్ సన్నిహితులు చెబుతున్నారు.
400 రూపాయలు పొదుపు చేయడం ద్వారా సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
సారా అలీ ఖాన్ కెరీర్ విషయంలో ఆచితూచి నడుస్తుంది సంగతి తెలిసిందే. సారా అలీ ఖాన్ మహా పొదుపరి అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
No comments