• Breaking News

    తెలుగు వారి మనసు దొంగలించిన నివేత థామస్

     నిన్ను కోరి, బ్రోచేవారెవరురా లాంటి సినిమాలతో టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో కూడా పాగా వేసిన కేరళ కుట్టి నివేదా థామస్ .


    కళ్లతోనే అన్ని భావాలు పలికించే యువ నటి నివేదా థామస్ . మలయాళ అమ్మాయి అయినా, తెలుగు ప్రేక్షకులకు కూడా తన నటనతో బాగా దగ్గరైన హీరోయిన్,


     నిన్ను కోరి, బ్రోచేవారెవరురా లాంటి సినిమాలతో తెలుగు వారి గుండెల్లో కూడా పాగా వేసిన కేరళ కుట్టి నివేదా థామస్. 

    బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నివేద.. ఇప్పుడు మలయాళ సినిమాలతో పాటు దక్షిణాది భాషలలో కూడా అనేక సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందు వరుసలో ఉంది. 


    అందం, అభినయంతో పాటు.. చలాకీతనం, కాస్త డేరింగ్ యాటిట్యూడ్ అనేవి నివేదా నటనకు ప్లస్ పాయింట్స్. 

    బాల్యం:

    నివేదా థామస్ తమిళనాడు రాష్ట్రంలో 1995 నవంబర్ 2 తేదీన జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మలయాళీ కుటుంబానికి చెందిన వారు. 


    నివేదా చదువు దాదాపు చెన్నెలోనే పూర్తి చేసింది. ఎస్.ఆర్.ఎమ్ యూనివర్సిటీలో ఈమె డిగ్రీ పూర్తి చేశారు.


     నివేదా తమిళం, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ భాషలలో చిన్నప్పుడే మంచి పట్టు మట్లడగలడు. 


    నివేదా థామస్ బాల నటిగా మలయాళ సినిమాల్లో చేసింది. ఆ తరువాత పలు సీరియల్స్‌లో నటించింది. 



    'వెరుథె ఒరు భార్య'  నివేదా థామస్ మొదటిసారి సినిమా. ఈ సినిమాలో నివేదా నటనకు మంచి గుర్తింపు దక్కింది. 



    అంతేకాదు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే 'ఉత్తమ యువ నటి పురస్కారం' కూడా పొందింది నివేదా థామస్.




    No comments