• Breaking News

    లైగర్‌ భామ అనన్య పాండే 2 సంవత్సరాలు ప్రేమ కథకి ముగింపు కార్డు.......

     బాలీవుడ్‌లో ఎక్కువగా అనన్య పాండే పేరు వినిపిస్తుని .అనన్య పాండే చేసిన సినిమాలు హిట్‌ అయినా.. కాకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో ఆమె పేరు వింటూనేఉంటాం.




    ముఖ్యంగా బాలీవుడ్‌ హీరో ఆదిత్యరాయ్‌ కపూర్‌తో అనన్య పాండే ప్రేమాయణంపై కొద్దిరోజులుగా రూమర్స్‌ చూస్తున్నాం.

    బాలీవుడ్‌లో ఎక్కువగా వింటూంటాం పేర్లలో అనన్య పాండే ఒకరు. చాలా రోజులుగా వీరిద్దరూ కలిసి ఈవెంట్స్‌, రెస్టారెంట్స్‌, పార్టీల్లో కనిపించారు. దీంతో వీళ్లిద్దరూ నిజంగానే లవ్‌ బర్డ్స్‌ అని బీటౌన్‌ కన్ఫార్మ్‌ చేసేసింది.


     అయితే ఈ జంట ఇప్పుడు విడిపోయిందట. రెండేండ్ల ప్రేమకు వీళ్లిద్దరూ బ్రేకప్‌ చెప్పారనే వార్త ఇప్పుడు బీటౌన్‌ సర్కిల్‌లో తెగ వినపిస్తుంది. ఆదిత్యరాయ్‌ కపూర్‌, అనన్య బ్రేకప్‌ విషయాన్ని వాళ్ల సన్నిహితుడు ఇటీవల తేలిపారు.


     ఒక చిట్‌చాట్‌లో పాల్గొన్న అతను.. ఆదిత్య, అనన్య ఇద్దరూ నెల క్రితం విడిపోయారని క్లారిటీ ఇచ్చారు. వాళ్లిద్దరూ  మాంచి జంట  చాలా క్లోజ్‌గా ఉండేవారని.. ఒకరితో మరొకరు చాలా అన్యోన్యంగా ఉండేవారని తేలిపారు. 


    కానీ ఇలా సడెన్‌గా విడిపోవడం మా అందరికీ షాకిచ్చిందని చెపికొచ్చారు.


     ప్రస్తుతం అనన్య మూవ్‌ ఆన్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుందని అన్నాడు. బ్రేకప్‌ గాయం ఆమెకు గట్టిగా తగిలిందని.. ఆ బాధను మరిచిపోయేందుకు పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడుపుతోందని పెర్కొనాడు.



     ఆదిత్యరాయ్‌ కపూర్‌ కూడా మెచ్యూరిటీతో పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిపారు.
    అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం వేడుకలో ఆదిత్య రాయ్‌ కపూర్‌, అనన్య పాండే చివరిసారిగా కలిసి కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా జంటగా కనిపించలేదు.

     ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో పాల్గొని ముంబై వచ్చిన తర్వాతే తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారట. అనన్య సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం మార్చిలోనే వీరిద్దరూ విడిపోయినట్లు కనిపిస్తుంది.





    No comments