ఒక స్టార్ హీరో తనను అసభ్యం గా తాకాడు అని సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్
నిత్యా మీనన్ ఒక భారతీయ సినీ మరియు గాయని కుడా.ఈమె విజయవంతమైన తెలుగు చిత్రాలతో పాటు టు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు కూడా అందుకుంది.
మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది తర్వాతి కాలంలో ఆమెకు మళ్ళీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది. అక్కడ ఆమెకు బి. వి. నందినీ రెడ్డి పరిచయం అయ్యి, ఆమెను నటనవైపు ప్రోత్సహించింది.
నిత్య మంచి సినిమాలు మాత్రయే చేసుకుంటూ.స్కిన్ షోస్ ఏమి చేయకుండా చాల ట్రెడిషనల్ గా వుండే పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఆమె చేసే సినిమాలు అద్భుతంగా ఉంటాయి మరి. తాజాగా ఆమె శ్రీమతి కుమారి అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది.
నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది, ఇష్క్ గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
అయితే కాస్టింగ్ కౌచ్ కి ఎవరూ అతీతం కాదు అన్నట్లుగా నిత్యా మీనన్ కి కూడా చిత్ర పరిశ్రమలో చేదు అనుభవం ఎదురైందట. తాజాగా నిత్యామీనన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.
No comments