• Breaking News

    తన పెళ్లి పై వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన వర్షాబొల్లమ్మ

     వర్షాబోళ్లమ్మ కర్ణాటకలోని కూర్గ్‌లో పుట్టి బెంగళూరులో పెరిగారు. బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో మైక్రోబయాలజీలో విద్యను పూర్తి చేసింది.



    వర్ష కన్నడ, తమిళం, మలయాళంతో సహా పలు భాషల్లో నటించింది.ఈమె తమిళ్,కన్నడ,మలయాళం తో పాటు తెలుగు కూడా మాట్లాడుతుంది.



    తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం,వూరుపేరు భైరవకోన  చిత్రాల్లో నటించి మెప్పించింది.


    స్వాతిముత్యం సినిమాలో తనతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ తో వర్ష ప్రేమలో ఉందని,త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.



    ఇక లేటెస్ట్ గా తన పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసింది వర్షా.నిజం చెప్పాలంటే అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్స్ అంతే. కానీ మా మధ్య మీరు అనుకున్టటువంటిది ఏమి లేదు అని చెప్పింది.



    ఇద్దరు కలిసి నటిస్తే వాళ్ళ ఇద్దరి మధ్య ఎదో ఉందంటూ ఎలా అనుకుంటారు అని ఆ వార్తలపై తనదైన స్టైల్ లో గట్టి కౌంటర్ ఇచ్చింది.


    వర్ష బొల్లమ్మ సినిమాల విషయానికి వస్తే నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో ఎంటరైంది. అయితే ఈమె హీరోయిన్ కాదు. ఓ కీలక పాత్ర కోసం వర్షను తీసుకున్నారు. సినిమాను మలుపుతిప్పే క్యారెక్టర్ అవ్వడంతో, వర్ష కూడా నటించడానికి అంగీకరించింది.


    వర్షా బొల్లమ్మ తెలుగుతో పటు తమిళ్ సినిమాలు చేస్తూ బిజీ ఐపోయింది.ప్రస్తుతానికి ఆమె చేతిలో చాలా ప్రాజెక్ట్స్ వున్నాయి.మరి చూడాలి వర్షా తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందో లేదో.

    No comments