తన కోరిక అదే అని అంటున్న శివాని రాజశేఖర్....
తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
2021లో వచ్చిన శివాని రాజశేఖర్ అద్భుతం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ ను ఇవ్వలేకపోయింది దీనితో ఈ అమ్మడి ఆశలు అన్ని నిరాశ అయిపోయాయి.
ఆ తరువాత ఈ అమ్మడు కోట బొమ్మాళి పీ.ఎస్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది.
సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సిరీస్ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్స్ పరిస్థితి ఏంటో అందరికీ తెలసిందే. పేరుకు తెలుగు హీరోయిన్లు రావాలి రావాలి అంటూ అందరూ చెబుతారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వరు. ఎంత అందమున్నా వాళ్లకి ఎదురుచూపులే మిగులుతున్నాయి. హీరోయిన్ శివాని రాజశేఖర్ పరిస్థితి కూడా ఇదే.
చూడటానికి అందంగా ఉండే ఈ బ్యూటీకి ఇప్పటివరకూ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలే రాలేదు. కానీ చిన్న సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతూనే ఉంది. శివానీ రీసెంట్‌గా విద్య వాసుల అహం లో నటించి తన గ్లామర్ తో ఇరగదీసింది.
శివానీ ప్రస్తుతం సినిమాలతో పాటు డాక్టర్ చదువుతోంది. ఈ యేడాది లో ఈమె డాక్టర్‌గా పట్టాపుచ్చుకోనుంది.
రెండేళ్ల క్రితం ఈమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అదే రోజు ఆమె డాక్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
No comments