• Breaking News

    సాలార్ బ్యూటీ సెక్సీ లుక్స్

    శ్రుతి హాసన్ 28 జనవరి 1986  సంవత్సరం లో జన్మించింది.తెలుగు, హిందీ మరియు తమిళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి మరియు గాయని. 


     ఆమె రెండు ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ మరియు మూడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ దక్కించుకుంది.  2015 మరియు 2016లో ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో శ్రుతిహాసన్ పేరు సంపాదించారు.



    శ్రుతి హాసన్ సినీ జీవితం మెదట పరాజయాలు పలకరించినప్పటికి త్రి, గబ్బర్ సింగ్ సినిమాలు మంచి నటిగా గుర్తింపునిచ్చాయి.పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది.



    రవితేజ సరసన బలుపు, జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన రామయ్యా వస్తావయ్యా ఇలా పలు చిత్రాలలొ నటించింది. తెలుగు, తమిళ సినిమాలలో మంచి నటిగా పేరు సంపాదించుకుంది. నటిగానే కాకుండ గాయనిగా కొన్ని సినిమా పాటలు పాడారు. 



    వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌‌కు 2019లో తెరపడింది. అభిప్రాయభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలే‌కు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.


    ఆమెకు వెనక కొండంత అండగా తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌ కూడా స్టార్ట్ చేసింది.


     ఇక ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన  సలార్‌లో కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా డిసెంబర్ 22న భారీగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. 



    అయితే మొద‌ట్లో ఐర‌న్ లెగ్‌గా పేరు మోసిన ఈ న‌టి ఆ త‌రువాత చాలా మంది స్టార్ హీరోల‌కు గోల్డెన్ హ్యాండ్‌గా మారింది. పవన్ కళ్యాణ్ తర్వాత , మాస్‌రాజా ర‌వితేజ‌కు గోల్డెన్ లెగ్‌లా మారింది శ‌ృతి. 2013లో ర‌వితేజ స‌ర‌స‌న శృతి బ‌లుపు చిత్రంలో న‌టించ‌గా.. ఆ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. 



    మరోవైపు శృతి హాసన్ చేతిలో కొన్ని క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. గత ఏడాది శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ చిత్రాలు విజయం సాధించాయి. నెక్స్ట్ ఆమె సలార్ 2లో ప్రభాస్ కి జంటగా మరోసారి కనిపించనుంది.. 

    No comments