• Breaking News

    తనే నా ఫస్ట్ లవ్ అంటున్న రెజీనా కాసాండ్రా

     రెజీనా కాసాండ్రా 1988  సంవత్సరం డిసెంబరు 13 న జన్మించారు.ఈమె తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన భారతీయ నటి.


    అందం మరియు అభినయం రెండు సరిసమానంగా ఉన్న హీరోయిన్స్ లో రెజీనా ఒకరు. సుధీర్ బాబు హీరో గా నటించిన మొదటి చిత్రం ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైంది.


    ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో భారీ క్రేజ్ అందుకుంది.



     అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు  చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో రెజీనా బోల్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి తాను ఏంటో ప్రూవ్ చేసుకుంది.



    పలు తెలుగు, తమిళ చిత్రాలతో కెరీర్ కొనసాగిస్తున్న రెజీనా.. యూత్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకొని పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది.


    ఎన్ని హిట్స్ ఇచ్చినా.. ఆమెకు స్టార్ డమ్ మాత్రం దక్కలేదు. తోటి హీరోయిన్లు టాప్ లో దూసుకుపోతుంటే రెజీనా మాత్రం అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలిగింది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళంలో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.



    తన ఫస్ట్ క్రష్ ఐదోతరగతిలోనే మొదలైందంటూ  లేటెస్ట్ గ వచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది .అయితే నెటిజన్స్ మాత్రం అంత చిన్న వయసులోనే లవ్ ఆ అంటూ గుసగుస లాడుతున్నారు.


    ప్రస్తుతం రెజీనా కాసాండ్ర తమిళంలో చాల సినిమాల్లో నటిస్తోంది.  ఇప్పటికి కూడా ఫుల్ బిజీగానే గడుపుతోంది.


    ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత వర్ణించలేనిది అనే చెప్పాలి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే.

    No comments