ఇకపై సినిమాలకు బై చెపుతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్
కంగనా రనౌత్ 1987 మార్చి 23 న పుట్టారు.బాలీవుడ్ లో ఎక్కవుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణులలో ఒకరు.
బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కంగనా రనౌత్ బాగా ఫేమస్ అయ్యారు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయ్యారు కంగనా. ఆమె ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఫ్యాషన్ లేడీగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ వెండితెర నుంచి పొలిటికల్ స్క్రీన్ పై తన సత్తా చాటాలని భావిస్తోంది.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ బీజేపీ తరపున పోటీలో నిలబడింది.
తన నటన కంటే బాలీవుడ్ సెలబ్రిటీలపై హాట్ కామెంట్స్ చేసే నటిగానే బాగా పేరుగాంచిన ఈమె ఇప్పుడు ఎన్నికల్లో గెలిస్తే నటనకు స్వస్తి చెబుతానని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.
తనను తాను అమితాబ్ బచ్చన్ తో పోల్చుకుంటూ, నేను రాజస్థాన్‌కు వెళ్లినా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ లేదా మణిపూర్‌కు వెళ్లినా, ప్రజల నుండి నాకు చాలా ప్రేమ మరియు గౌరవం లభిస్తుందని, అమితాబ్ బచ్చన్ జీ తర్వాత అంతటి గౌరవం తనకు దక్కిందని చెప్తుంది.
ఒక ఇంటర్వ్యూలో ఎన్నికల తర్వాత తన ఫ్యూచర్ ప్రణాళిక గురించి పెద్ద ఎత్తున వెల్లడించారు. ఎన్నికల తర్వాత బాలీవుడ్ నుండి తప్పుకుంటారా అని అడిగినప్పుడు, కంగనా నేను గెలిస్తే కచ్చితంగా సినిమాలు చేయను అని ఖరాకండిగా చెప్పేసింది.
సినిమాలు వదిలేసి ప్రజల్లోకి వచ్చి,ఒక ఉత్తమ ఎంపీగా తన నియోజక వర్గానికి తన వంతు కృషి చేస్తాను. అదే నాకు గొప్ప అవార్డుగా భావిస్తాను’ అని కంగనా వ్యక్తం చేసింది.
ఇక కంగనా నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ వాయిదా పడింది. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ప్రచారంలో మునిగిపోయి ఉండటంతో ఎమర్జెన్సీ చిత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాను కంగనా రనౌత్ తన సొంతం గా డైరెక్ట్ చేసింది.
No comments