• Breaking News

    కీర్తి సురేష్ గ్లామరస్ ...ఫొటోస్

     

    కీర్తి సురేష్ ఒక భారతీయ నటి. ఆమె 1992 అక్టోబర్ 17 న చెన్నై లో పుట్టారు.కీర్తి సురేష్ సినీ నిర్మాత జి. సురేష్ కుమార్ మరియు నటి మేనకా జి. సురేష్ లకు జన్మించింది.ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది.



    కీర్తి సురేష్ బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది మరియు ఫ్యాషన్ డిజైన్‌ను అభ్యసించిన తర్వాత సినిమాలకు తిరిగి వచ్చింది. ఆమె 2013 మలయాళ చిత్రం గీతాంజలిలో తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది, దాని కోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డును గెలుచుకుంది.




    రామ్ హీరోగా చేసిన నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా మంచి విజయం సాధించింది.మొదటి సినిమాలో కీర్తి సురేష్ ని చూసి ఎంతోమంది విమర్శలు చేశారు.అసలు ఈ హీరోయిన్ కి నటన వచ్చా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ అనుమానాలు అన్నీ కూడా తన మహానటి సినిమాతో క్లియర్ చేసింది కీర్తి సురేష్.



    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి అందరి దగ్గర ప్రశంసలు అందుకుంది. ఆ పాత్ర కీర్తి సురేష్ తప్ప ఎవ్వరూ చేయలేరు అన్నంత పేరు తెచ్చుకుంది.మహానటి సినిమాకి నంది అవార్డు సైతం అందుకుంది ఈ హీరోయిన్.





    ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి టాలెంట్ , అదృష్టం కలిసి ఉంటే చాలు అని చెప్పి కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.



    భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన అవార్డు.. మహానటి చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.



    దక్షిణాది అగ్ర కథానాయికల్లో అందాల భామ కీర్తి సురేష్ ఒకరు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి.. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఓవైపు అగ్ర హీరోలతో కలిసి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతోంది.





    కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్  చేస్తుంది.





    ప్ర‌స్తుతం కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉంది. వ‌రుస‌గా సినిమాలు చేస్తుంది. అందులోనూ త‌మిళ్ లో చాలా బిజీగా ఉంది.  గ్లామ‌ర్ విష‌యంలో కూడా ఎలాంటి కండీష‌న్లు పెట్టుకోకుండా పనిచేస్తుంది.

    No comments