• Breaking News

    కుర్ర కారుల మతులు పొగుడుతున్న కాజల్ అగర్వాల్..

     కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. కాజల్ 1985 జూన్ 19న ముంబాయిలో జన్నించింది.కాజల్  మోడల్ మరిము నటీమణి కూడా. ఈమె తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా నటించింది.




    ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది.2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కూడా కథానాయికగా నటించింది.




    ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది.ఈ సినిమా తో టాలీవుడ్ అగ్ర కథ నాయికగా నిలిచింది.




    కాజల్ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ తో జత కట్టి సౌత్ లో దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది.



    ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు అయినా  గౌతమ్ కిచ్చ్లూ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా వుంది.వీళ్లు ఇద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు.





    ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ పాత్రలకు కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తోంది.గతేడాది బాలక్రిష్ణ తో కలిసి భగవంత్ కేసరి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది.



    కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో కాజల్ తన ఫస్ట్ లవ్ గురించి వెల్లడించింది. నెట్టీంట సందడి చేస్తున్న ఆ వీడియోలో కాజల్ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది. అతని పేరు అక్షయ్ అని, కాలేజ్ రోజుల్లో జరిగిన తన వన్ సైడ్ లవ్ స్టోరీని రివీల్ చేసింది. అలాగే తనకు క్రికెట్ అంటే ఇష్టమని, రోహిత్ శర్మకు వీరాభిమానిని అని కాజల్ క్లారిటీ ఇచ్చింది.



    ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. అలాగే సత్యభామ అనే చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ గురించే కాజల్ ఫ్యాన్స్  వెయిట్ చేస్తున్నారు.















    No comments