రష్మిక భారతీయ చలన చిత్ర నటి మరియు మోడల్. ఈమె 1996 ఏప్రిల్ 5న కర్ణాట స్టేట్ లో కూర్గ్ అనే గ్రామంలో జన్మించారు.
రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
సినిమాల్లోకి రాకముందు పలు టీవీ యాడ్స్ లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా’ టైటిల్ సొంతం చేసుకుంది. దాంతో పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడి.. 2016లో కన్నడ సినిమా ‘కిర్రీక్ పార్టీ’ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసింది.
రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు.
రష్మిక మందన్న.. తెలుగులో ఛలో మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి డియర్ కామ్రేడ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రూల్ మూవీ లో అల్లు అర్జున్ సరసన నటించింది .ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
పుష్ప మూవీ హిట్ కావడంతో అమ్మడు రేంజ్ ఒక్క సారిగా మారిపోయింది.పాన్ ఇండియా హీరోయిన్ అయిపొయింది.దీనితో అమ్మడి పారితోషకం భారీ స్థాయి కి పెంచేసింది.
ఇక లేటెస్ట్‌గా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించింది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా కు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అయ్యింది.
ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే రష్మిక పాటు పుష్ప2 : ది రూల్ - 15 ఆగస్టు విడుదల కానుంది. ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమా, రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా, రెయిన్‌బో - లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో బిజీ గా వుంది.
ఇక మరోవైపు రష్మిక ఓ సంచలన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో 38 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది. దీంతో ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకుంది.
No comments