• Breaking News

    కుర్రకారులను ఫిదా చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ....

     సంయుక్త మీనన్ 1995 సెప్టెంబరు 11న కేరళ లో పాలక్కడ్‌లో జన్మించింది. ఆమె చిన్మయ విద్యాలయలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, త్రిసూర్లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది.



    సంయుక్త మీనన్ 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసింది.2018లో కలరి సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది.


    ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ మరియు టాలెంట్ కి చాలా ప్రజాదరణ దక్కింది. ఆమె చాలా మంది ప్రముఖ నటీనటులకు కూడా పనిచేసింది. తన అత్యుత్తమ నటనకు గాను సంయుక్త 2020లో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. అక్కడ ఉత్తమ నటి అవార్డు అందుకొని మరింత పాపులర్ అయింది.



    సంయుక్త మీనన్ తెలుగులో మొదటి సరిగా  కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా  ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయినది.ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరో గ నటించిన భీమ్లా నాయక్ మూవీ లో రానా వైఫ్ గా నటించింది.ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.



    ఇక  ఒకే సంవత్సరం వ్యవధిలో  విడుదల అయిన నాలుగు సినిమాల్లో నటించింది. అంతేకాదు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీనితో ఈ అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.


    తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ నటించింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువమంది అభిమానులను మాత్రం సంపాదించుకుంది.



    సంయుక్త అత్యధిక పారితోషికం పొందుతున్న మలయాళ నటీమణులలో ఒకటిగా పరిగణించబడుతుంది.ఇప్పుడు ఈమె చేతిలో అరడజన్ కు పైగా సినిమాలున్నాయి.





    ఇప్పుడు సంయుక్త మీనన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.అలాగే తెలుగు,తమిళ్,కన్నడ సినిమాలతో బిజీ గా వుంది.





    No comments