హింసిస్తున్నారు.. మంగళవారం పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు
పాయల్ రాజ్‌పుత్.. Rx 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి మూవీతోనే మంచి పేరు దక్కించుకుంది.
ప్రధమ సినిమాతోనే యూత్ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆర్ఎక్స్ 100 తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా విజయం మాత్రం పొందలేదు.
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో చేసిన “మంగళవారం” సినిమా పాయల్‌కి మళ్లీ హిట్ తెచ్చిపెట్టింది.
దీంతో ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది పాయల్ రాజ్‌పుత్.
ఓ సినిమా మేకర్స్ నుంచి తాను బెదిరింపులు, వేదింపులు ఎదుర్కొంటున్నానని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ షేర్ చేసింది.
అగ్రిమెంట్ ప్రకారం నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇంకా క్లియర్ చెయ్యలేదు. అయినా నన్ను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారు"అని తెలిపింది.
రక్షణ మూవీలో పాయల్ రాజ్‌పుత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని వస్తుంది.
No comments