రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్
రకుల్ ప్రీత్ సింగ్ 1990 అక్టోబర్ 10న జన్మించారు. రకుల్ పంజాబీ కుటుంబానికి చెందినది. ఆమె ముఖ్యం గా తెలుగు చలన చిత్ర నటి. హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో కూడా నటించారు.
తరువాత రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ_చేస్కో, కిక్ - 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా, స్పైడర్ వంటి సూపర్ హిట్ చిత్రాలో నటించి,టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది.
ఫొటో షూట్లు, జిమ్ వీడియోలతో హల్ చల్ చేయడం తప్పిస్తే.. వెండితెర మీద రకుల్ కనిపించి రెండేళ్లకు పైగానే కావొస్తోంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో రకుల్ పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ఈ భామకు తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం ముంబైలో ఉంటోంది రకుల్.హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది.
తాజా గా రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో రకుల్ ఆమె మెడలో తాళి బొట్టు కనిపించలేదు. నుదిటిన బొట్టు కూడా లేకుండా దర్శనమిస్తుంది. దీంతో నెటిజన్లు రకుల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
No comments