• Breaking News

    క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్న మృణాల్ ఠాకూర్

    మృనాల్ ఠాకూర్ 1992 వ సంవత్సరం ఆగష్టు 1 వ తేదీన ముంబై లో జన్మించింది.ముంబైలోనే తన స్కూలింగ్, కాలేజీ పూర్తిచేసింది.



    మృణాల్.. 2012లో ‘ముజ్ సే కుచ్ కెహెతి.. యే కామోషీయన్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2014లో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది.


    తన మొదటి సినిమా వట్టిదండు(మరాఠీ)తో సినీ తెరంగేట్రం చేసింది. అలా 2018లో ‘లవ్ సోనియా’ అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది మృణాల్.



    తెలుగులో సీతారామం సినిమాలో అవకాశం అందుకొని, సీత పాత్రలో తన నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషలలో విడుదలైన ఈ సీతారామం మూవీ.. అన్నిచోట్లా ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని భారీ హిట్ గా నిలిచింది.



    సీతారామం సినిమాతో ఒక్కసారిగా దేశమంతా పాపులర్ అయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో మృణాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో ఎంతో పద్దతిగల  తెలుగు  అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది.




    ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చాలా బిజీగా ఉంది. ఓ పక్క క్యూట్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్తుండటంతో టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.




    ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మృణాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో ప్రస్తుతం మృణాల్ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది అని టాక్ నడుస్తుంది.


    హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రంలో కూడా మృణాల్ హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం వుంది.


    No comments