అదిరే అందాలతో కేక పుట్టిస్తోన్న అనుపమ పరమేశ్వరన్
అనుపమ 18 ఫిబ్రవరి 1996న కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడలో మలయాళీ కుటుంబంలో జన్మించింది.
అనుపమ, పరమేశ్వరన్ ఎరెక్కత్ మరియు సునీత పరమేశ్వరన్ దంపతులకు జన్మించింది. ఆమెకు ఒక తమ్ముడు అక్షయ్ ఉన్నాడు.
అనుపమ సినిమాలలో రాకముందు మలయాళంలో టీవిషోలు, సెలబ్రెటీ ఛాట్ షోలు, రియాల్టిషోలు చేసింది.
ఈమె మలయాళ చిత్రం ప్రేమమ్ ద్వారా వెండి తెరకు పరిచయమయ్యింది.ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి.
అనుపమ ఆ ఆ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఆ తర్వాత శర్వానంద్‌తో శతమానం భవతి చిత్రంలో కూడా నటించింది.ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ ను సాధించాయి.
కార్తీకేయ 2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన ఈ మలయాళీ అందం ఇటీవల రవితేజ ఈగల్‌లో నటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అనుపమ రీసెంట్ గ సిద్దు జొన్నల గడ్డ తో కలిసి టిల్లు 2
సినిమాతో వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.
No comments